అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిపించాయి. సినీ అభిమానుల నుంచి సలార్ ని KGF తో కంపేర్ చేస్తూ కామెంట్స్ రావడం మాములే కానీ రెండు ఒకేలా ఉండే అవకాశం లేదు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ వలన ఆడియన్స్ కి ఇలా అనిపించి ఉండొచ్చు. అయితే ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా నుంచి ఇలాంటి సెటప్ తోనే సినిమాలు చేస్తున్నాడు. భారీ బడ్జట్, హ్యూజ్ సెటప్, సాలిడ్ ఎమోషన్స్… ఇవి ప్రశాంత్ నీల్ బలం. ఉగ్రమ్, KGF సినిమాల మ్యూజిక్ కూడా ఒకేలా ఉంటాయి అంటే ప్రశాంత్ నీల్… తన గత సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఎంతగా ఇస్తాడో అర్ధం చేసుకోవచ్చు.
ప్రశాంత్ నీల్ ఎమోషన్ ని బలంగా నమ్ముతాడు… రెగ్యులర్ ఎమోషన్ నే హార్డ్ గా ఇంటెన్సిటీతో చెప్తాడు. KGF సినిమాలో మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని ప్రశాంత్ నీల్ సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. అంతటి కమర్షియల్ సినిమాలో హ్యూమన్ ఎమోషన్ ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడం అంత ఈజీగా కాదు. ఈ విషయంలో సక్సస్ అయిన నీల్, ఇప్పుడు సలార్ లో ఫ్రెండ్షిప్ ని చూపించబోతున్నాడు. గ్యాంగ్ వార్స్, భారీ ఫైట్స్, పెద్ద సెటప్ ఇన్ని ఉన్నా కూడా సలార్ సినిమాని నడిపించేది ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య ఉన్న స్నేహమే. ఈ పాయింట్ పట్టుకొనే ప్రశాంత్ నీల్ సీన్స్ అల్లి ఉంటాడు. అందుకే సలార్ నుంచి హీరో ఎలివేషన్ సాంగ్ ని కాకుండా ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేసాడు. ఏ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినా ఫ్రెండ్షిప్ కథలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు ఆ కొన్ని కథలు త్యాగాన్ని కోరుకుంటాయి, ఇక్కడ కథ రక్తాన్ని కోరుకుంటుంది. సో హిట్ ఫార్ములానే పట్టుకున్న ప్రశాంత్ నీల్… పృథ్వీరాజ్ కి అండగా ఒక డైనోసర్ ని నిలబెట్టి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.
