NTV Telugu Site icon

Salaar : సలార్ లో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన కుర్రాడికి మరో పాన్ ఇండియా బంపర్ ఆఫర్.. నక్క తోక తొక్కాడుగా!

Karthikeya In Lucifer 2

Karthikeya In Lucifer 2

Salaar Child Artist Karthikeya got Chance in Lucifer 2: ప్రజంట్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న మూవీ ‘సలార్’. నిన్న రిలీజ్ అయిన ఈ సలార్ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరూ చూసి సూపర్ ఉందని అంటున్నారు. ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే రిలీజ్ ట్రైలర్ ​తో మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ పెంచేసి ఈ మూవీ టికెట్స్ కోసం ఆడియెన్స్​ ఎగబడేలా చేశారు. టికెట్ల దెబ్బకి ఈ బుక్ మై షో సర్వర్ కూడా క్రాష్ అయిందని అంటే క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, రిలీజ్​ అయిన క్రమంలో నటీనటుల ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Dunki Day 2 Collections : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కలెక్షన్స్ డౌన్.. సలార్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..

‘సలార్’లో యాక్ట్ చేసిన పృథ్వి రాజ్ పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, ‘సలార్’లో చిన్నప్పటి పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్​లో నటించాడు. సినిమాలోని స్పెషాలిటీస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన అంశాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. తాను ప్రస్తుతం పదో తరగతి చదువుకుంటున్నానని, తన సొంతూరు ప్రకాశం జిల్లా కానీ హైదరాబాద్​లో ఫ్యామిలీ సెటిల్ అయ్యిందని అన్నాడు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు ‘సలార్​’ మూవీలో ఆడిషన్స్ రిహార్సల్ చేసే ఛాన్స్ వచ్చిందని అక్కడ తన యాక్టింగ్ నచ్చడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అవకాశం ఇచ్చారని అన్నాడు. ఇక ఈ క్రమంలోనే ‘సలార్​’లో తన యాక్టింగ్ నచ్చడంతో ‘లూసిఫర్ 2’లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆఫర్ ఇచ్చారని చెప్పాడు. ‘లూసిఫర్’ సీక్వెల్​లో తన చిన్నప్పటి రోల్​కు పృథ్వీరాజ్ సెలక్ట్ చేశారని కార్తికేయ చెప్పుకొచ్చాడు.