ముందు నుంచి అందరూ యాంటిసిపేట్ చేసినట్లే సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్న కెజియఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసేసింది సలార్. 24 గంటలు గడవకముందే 100 మిలియన్స్ వ్యూస్ టచ్ చేసిన సలార్ ట్రైలర్… 24 గంటల్లో 116 మిలియన్స్ వ్యూస్, 2.7 మిలియన్స్ లైక్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకున్న డిజిటల్ రికార్డ్స్ అన్నీ సలార్ దెబ్బకు ఎగిరిపోయాయి. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ కాగా… ఐదు రోజుల్లోనే 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. దీంతో ఇండియాస్ మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ట్రైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఇతర సినిమాలకి చాలా కాలమే పడుతుందా లేక ప్రభాస్ మళ్లీ ప్రాజెక్ట్ కల్కి తో బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది సలార్. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలిపారు.
ఇకపోతే… డిసెంబర్ 15 నుంచి ఇండియాలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవనున్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. యూఎస్ ప్రీమియర్స్ దగ్గర సలార్ సత్తా చాటుతోంది. జస్ట్ అడ్వాన్స్ సేల్స్‌లోనే నాలుగు లక్షల డాలర్లు మార్క్‌ని క్రాస్ చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తోంది సలార్. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలకు పైగానే సమయం ఉంది. అప్పుడే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే… రిలీజ్ వరకు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సలార్ హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించగా… శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు.
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
𝟏𝟓𝟎 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧+ Digital Views for #SalaarTrailer 🔥💥
▶️ https://t.co/TBUEgQJA3H#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/hu6BGVlFe5— Hombale Films (@hombalefilms) December 5, 2023
