NTV Telugu Site icon

Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…

Supriya Menon On Salaar

Supriya Menon On Salaar

కేవలం అనౌన్స్మెంట్ తోనే ఇండియాని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘సలార్’మాత్రమే. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An Action Saga #Salaar అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసిన ప్రశాంత్ నీల్, మోస్ట్ వయోలెంట్ మాన్ అంటూ రచ్చ చేశాడు. ప్రభాస్ గన్ను పట్టుకున్న పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అప్పటివరకూ ఒక సినిమా అనౌన్స్మెంట్ ఇండియాలోనే హాట్ టాపిక్ అవ్వడం అదే మొదటిసారి. ఈ అనౌన్స్మెంట్ వచ్చి నేటికి రెండేళ్లు అవుతుంది. 2020 డిసెంబర్ 02న ‘సలార్’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ రెండేళ్లుగా అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అలానే మైంటైన్ చేస్తున్న ఈ మూవీ గురించి గత రెండేళ్లలో అఫీషియల్ గా వచ్చిన వార్తలు ఏంటో చూద్దాం.

రెండేళ్ల క్రితం డిసెంబర్ 2న అనౌన్స్ అయిన ‘సలార్’, జనవరి 15న పూజా కార్యక్రమాలు జరుపుకోని గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ పూజా కార్యక్రమాలకి ‘రాకీ భాయ్’ కూడా రావడం విశేషం. ఇది జరిగిన నెలన్నరకి 2021 ఫిబ్రవరి 28న సలార్ సినిమాని 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నాం అంటూ హోంబలే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది అంటూ ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 2021 ఆగస్ట్ 23న సలార్ సినిమాలో విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు, ఆయన పాత్ర పేరు ‘రాజమన్నార్’ అంటూ ఒక పోస్టర్ బయటకి వచ్చింది. ఈ పోస్టర్ లో జగపతిబాబు లుక్ చూస్తే ప్రభాస్ కి పర్ఫెక్ట్ విలన్ దొరికాడు అనిపించకమానదు. 2021  ఆగస్ట్ నుంచి 2022 జనవరి వరకూ సలార్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు.

శృతి హాసన్ పుట్టినరోజు సంధర్భంగా 2022 జనవరి 28న సలార్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో శృతి హాసన్ ‘ఆద్యా’గా కనిపించనుందని ఆమె ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. మే 17న ‘సలార్’ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని అనౌన్స్ చేశారు. మే 18న ప్రశాంత్ నీల్ ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని రెడీ అవుతున్నాడు అంటూ మేకింగ్ వీడియో బయటకి వచ్చి నెట్ లో హల్చల్ చేసింది. జూన్ 4న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో, రెండు ఫోటోలని పోస్ట్ చేసి ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ఆగస్ట్ 15న ‘సలార్’ సినిమాని 2022 ఏప్రిల్ 14 నుంచి 2023  సెప్టెంబర్ 28కి వాయిదా వేస్తున్నట్లు షాకింగ్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. ఎన్నో అంచనాలతో సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానులకి ఈ వాయిదా అనౌన్స్మెంట్ షాక్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఊహించని విధంగా స్ప్రెడ్ అవ్వడంతో, షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక సినిమాలు కరోనా ప్రభావం తగ్గాక సెట్స్ పైకి వెళ్లాయి.

ఈ వాయిదా ప్రకటన తర్వాత ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్పీడందుకుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటూ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేస్తున్న ఈ మూవీ నుంచి అక్టోబర్ నెలలో రెండు పోస్టర్స్ బయటకి వచ్చాయి. అందులో ఒకటి అక్టోబర్ 16న బయటకి వచ్చింది. మలయాళ హీరో పృథ్వీ పుట్టిన రోజు సంధర్భంగా… సలార్ సినిమాలో ‘వరదరాజ మన్నార్’గా నటిస్తున్నాడు అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన వారానికే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆరోజు ప్రభాస్ ఫొటోస్ ని ‘సలార్’ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఇవి గత రెండేళ్లలో సలార్ సినిమా నుంచి అఫీషియల్ గా వచ్చిన అనౌన్స్మెంట్స్ అండ్ అప్డేట్స్. పాన్ ఇండియా ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘సలార్’ సినిమా 2023 సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందేమో చూడాలి.

 

 

 

Show comments