Site icon NTV Telugu

Prithviraj: సలార్ విలన్ 25 కోట్ల ఫైన్ కట్టాడా?

Prithvi Raj Sukumaram

Prithvi Raj Sukumaram

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ సలార్ మూవీపై ఉన్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన సలార్ సినిమా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న కమర్షియల్ డ్రామాగా హిస్టరీ పేరు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా, జగపతి బాబు కొడుకుగా మలయాళ స్టార్ హీరో ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ నటిస్తున్నాడు. వరదరాజ్ మన్నార్ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నాడు, ఈ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ చాలా వయోలెంట్ గా కనిపించాడు. సలార్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న ఈ మలయాళ స్టార్ హీరో, హిందీలో సినిమాలని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. ఇటివలే అక్షయ్ కుమార్ హీరోగా సెల్ఫీ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పృథ్వీరాజ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని నిర్మించడానికి రెడీ అయ్యాడు. దీంతో పృథ్వీరాజ్ పై కేరళ మీడియాలో కొన్ని నెగటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి.

ఇటివలే పృథ్వీరాజ్ పై ఈడీ రైడ్స్ జరిగాయి, ఈ సంధర్భంగా కొన్ని మీడియా సంస్థలు పృథ్వీరాజ్ ఈడీకి 25 కోట్ల ఫైన్ కట్టాడని కొన్ని ఆర్టికల్స్ ని ప్రచురించాయి. ఇది మాత్రమే కాకుండా పృథ్విరాజ్ సుకుమారన్ ప్రాపగెండా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనే మాట కూడా కేరళ మీడియాలో వినిపిస్తోంది. ఈ విమర్శలు ఎక్కువ అవ్వడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. “నేను ఈడీ వాళ్లకి 25 కోట్లు ఫైన్ కట్టాను, ప్రాపగెండా సినిమాలని చేస్తున్నాను అని నాపై అబద్ద ప్రచారం జరుగుతోంది. మాములుగా అయితే ఇలాంటి విషయాలని అసలు పట్టించుకునే వాడిని కాదు కానీ కొందరు అదే పనిగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకే అలా చేసే వారందరి పైన లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను” అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ చేశాడు. ఏడాదికి ఆరు ఏడు సినిమాలు చేసే పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడితో అయినా ఆ అసత్య ప్రచారాలు చేసే వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాలి.

Exit mobile version