NTV Telugu Site icon

Sairam Sankar: పూరి తమ్ముడి సినిమాకు దర్శకుడు వంశీ పాటలు!

V

V

Vamsy: సీనియర్ దర్శకుడు వంశీని అభిమానించని సినీ దర్శకులు ఉండరు! మరీ ముఖ్యంగా నిన్నటి తరం దర్శకులకు వంశీ మేకింగ్ అంటే తెగ అభిమానం. అందులో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. విశేషం ఏమంటే… పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి దర్శకుడు వంశీ పాటలు అందిస్తున్నారు. సాయిరాం శంకర్ కథానాయకుడిగా విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 మంగళవారం లాంఛనంగా ప్రారంభమైయింది. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొంభైలలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం సన్నివేశంలో “గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు” అని సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.

మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. అఫీషియల్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించి ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు. “మధుర వైన్స్, జైత్ర” వంటి సినిమాలు పని చేసిన మోహన్ చారి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి పని చేసిన కార్తీక్ శ్రీనివాస్ ఈ మూవీకి ఎడిటర్. దర్శకుడు పెద్ద వంశీతో పాటు రెహమాన్ కూడా ఈ సినిమాకు పాటలు రాస్తున్నారు.