NTV Telugu Site icon

Sai Pallavi: పుష్ప 2 లో నేను.. చాలా హ్యాపీగా ఉంది

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి. వాటిపై క్లారిటీ కూడా రాలేదు. ఇకపోతే ఇంకోపక్క ఆమె.. పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరు స్టార్ డ్యాన్సర్లు ఒక సాంగ్ లో చేస్తే చూడాలని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అందులో నిజం లేదని సాయి పల్లవి చెప్పడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. పుష్ప 2 కోసం తనను ఎవరు సంప్రదించలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ” పుష్ప 2 లో నేను లేను.. కానీ, చాలా హ్యాపీ గా ఉంది. అలాంటి సినిమాలో నేను ఉన్నాను అని అనుకున్నందుకు” అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Hey Ram: ‘ఆదిపురుష్’ కొత్త పోస్టర్ కూ తప్పని ట్రోలింగ్!

ఇకపోతే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాతోనే బన్నీ ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక పుష్ప 2 కోసం ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఏవేవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రష్మిక పాత్ర చనిపోతుందని, ఆమె ప్లేస్ లో ఇంకో హీరోయిన్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత సమంత.. పుష్ప 2లో హీరోయిన్ అని, సాయి పల్లవి హీరోయిన్ అని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు. అయితే అవేమి నిజాలు కావని మేకర్స్ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు. ఈ రూమర్స్ కు చెక్ పడాలంటే పుష్ప 2 రావాల్సిందే మరి.

Show comments