Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుండగా.. శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను దింపుతూ హైప్ ను పెంచేస్తున్నాడు శైలేష్. అసలు వెంకీ మామ సినిమా అంటేనే హైప్ వస్తుంది. ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సపోర్ట్. ఇక ఆయన్ను మించిన స్టార్ క్యాస్ట్ ను శైలేష్ దింపుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరోను రంగంలోకి దించాడు శైలేష్.. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య.. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Paper Cups: పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది..
తాజాగా ఆర్య పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. మానస్ అనే పాత్రలో ఆర్య నటిస్తున్నాడని మేకర్స్ తెలిపారు. ఇక పోస్టర్ లో ఆర్య లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆర్య చేతిలో గన్ పట్టుకొని నడుస్తూ వస్తున్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక మానస్.. నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడా..? పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ను దింపుతున్నాడు. ఇక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అంటే ఇదే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ క్యాస్టింగ్ చూసి అభిమానులు.. ఏందయ్యా ఈ క్యాస్టింగ్.. జనాలను చంపేస్తావా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Unyielding Power, Unmatched Skill & An Unstoppable Force 🔥
Introducing the Most Versatile @arya_offl as MANAS from #SAINDHAV 💥#SaindhavOn22ndDEC ❤️🔥@VenkyMama @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/dB87adDmuo
— Sailesh Kolanu (@KolanuSailesh) August 30, 2023
