NTV Telugu Site icon

Saindhav: చివరి 20 నిముషాలు… ముందెప్పుడూ చూసి ఉండరు

Saindhav

Saindhav

విక్టరీ వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. చంద్రప్రస్థాలో బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ లో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్… సైంధవ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన వెంకటేష్… అన్ని సినిమాల్లో కలిపి చేసినంత విధ్వంశం సైంధవ్ ఒక్క దాంట్లోనే చేసినట్లు ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగించేలా ట్రైలర్ ని కట్ చేసారు. ట్రైలర్ తో టెక్నీకల్ గా సైంధవ్ సినిమా స్ట్రాంగ్ గా ఉందని ప్రూవ్ చేసింది సైంధవ్ సినిమా.

Read Also: Raviteja: సోలో రిలీజ్ అన్నారు… పోటీలోకి ఇంకో మూవీ వచ్చింది?

లేటెస్ట్ గా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో… శైలేష్ కొలను ట్వీట్ చేసాడు. “సైంధవ్ సినిమాలోని చివరి 20 నిముషాలు ఇప్పటివరకు మీ జీవితంలో చూసి ఉండరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు థియేటర్స్ లో సినిమా చూసినప్పుడు తెలుస్తుంది” అని శైలేష్ కొలను ట్వీట్ చేసాడు. మరి ఈ చివరి 20 నిముషాలు ఎలా ఉంటుంది, ఏ రేంజులో ఉంటుంది అనేది చూడాలి. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కాస్టింగ్ లుక్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఓవరాల్ గా సైంధవ్ చేసిన వార్… కమల్ విక్రమ్ సినిమాకి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. మరి సైంధవ్ నిజంగానే విక్రమ్ సినిమాలా ఉంటుందా లేక కొంచెం కొత్తగా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.