స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఊహని నిజం చేసి చూపించింది ‘విక్రమ్’ సినిమా. ఈ మూవీలో కమల్ లుక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రతి సినీ అభిమాని ఫిదా అయ్యాడు. ఇలాంటిదే తెలుగులో జరిగేలా కనిపిస్తోంది. చాలా కాలంగా మల్టీస్టారర్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్న వెంకటేష్ లోపల ‘గణేష్’, ‘ఘర్షణ’ లాంటి సినిమాలు చేసిన పక్కా మాస్ హీరో కూడా ఉన్నాడు. అలాంటి మాస్ హీరోని చాలా రోజుల తర్వాత బయటకి తెస్తూ ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు ‘శైలేష్ కొలను’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో రెండు సినిమాలు చేసి రెండు హిట్స్ ఇచ్చిన శైలేష్ కొలను, వెంకీ మామతో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
వెంకటేష్ 75వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సైంధవ్ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. నైట్ ఎఫెక్ట్ లో డిజైన్ చేసిన ఈ వీడియోలో వెంకటేష్ లుక్ చాలా మాసీగా ఉంది. సౌత్ ఇండియాలోనే చంద్రప్రస్థా అనే ఫిక్షనల్ కోస్టల్ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకోని, సైంధవ్ సినిమాని రూపొందిస్తున్నాడు శైలేష్ కొలను. గ్లిమ్ప్స్ షిప్పింగ్ యార్డ్ లో ఓపెన్ అయ్యింది, బుల్లెట్ బండిపై ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసి వెంకటేష్ ఎదో లిక్విడ్ ని తీసుకోని, అక్కడి నుంచి కంటైనర్ దెగ్గరికి వెళ్లాడు. అక్కడ స్మోక్ ఎఫెక్ట్ లో వెంకటేష్ ఫేస్ ని రివీల్ చేశారు. కంటైనర్ నుంచి ఒక గన్ తీసుకోని మళ్లీ బైక్ దగ్గరికి వచ్చి వెంకటేష్ ఒక రేంజులో నిలబడ్డాడు. అప్పటికే కొట్టి పడేసిన రౌడీలని చూస్తూ “ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను. రమ్మను” అని చాలా ఇంటెన్స్ డైలాగ్ ని చెప్పాడు వెంకటేష్. ఈ గ్లిమ్ప్స్ ని సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఉన్న ‘సైంధవ్’ గ్లిమ్ప్స్ ‘విక్రమ్’ సినిమాని గుర్తు చేస్తూ అంచనాలని పెంచేసింది.
He is Dangerous🤘🏻He is Deadly🔥&
He is Decisive😎Presenting @VenkyMama to the INDIAN CINEMA as #SAINDHAV 🔥
A new age action film👊🏾
by @KolanuSailesh🎬A @NiharikaEnt Production@vboyanapalli @Music_Santhosh @maniDop @tkishore555 @SVR4446 #Venky75 pic.twitter.com/7Q3Zzuh8qv
— Niharika Entertainment (@NiharikaEnt) January 25, 2023