Sailesh Kolanu Responds on Directing Game Changer Movie: రాం చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలను చేతిలోకి వెళ్లిందని గత ఏడాది జూలై సమయంలో ప్రచారం జరిగింది. శంకర్ అప్పుడు ఇండియన్ 2 హడావుడిలో ఉండడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా? అని జోరుగా కామెంట్స్ కూడా వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్ లో జాయిన్ కావడంతో ఆ విషయం చల్లారింది. అయితే నిజంగానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశారట. ఆ విషయాన్నే సైంధవ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ కోసం నేను తీసినవి B-roll షాట్స్. ఎస్టాబ్లిషింగ్, పాసింగ్ షాట్స్ లాంటివని అన్నారు.
Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన టీ సర్కార్
మాములుగా మేమయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ తో తీయించేస్తాం. కానీ శంకర్ మాములుగా అయితే ఆయనే తీస్తారు కానీ లొకేషన్ ఇబ్బందుల వలన నేను తీయాల్సి వచ్చిందని అన్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్ ని ముందుగానే బుక్ చేశారని అయితే ఆ టైంకు శంకర్ వేరే చోట అదే సినిమాను షూట్ చేయాల్సి రావడంతో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ ఎస్టాబ్లిషింగ్ షాట్స్ తను డైరెక్ట్ చేశానని చెప్పారు. లొకేషన్ కి ఆల్రెడీ డబ్బులు కట్టడం వల్ల ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే తీయించండి అని శంకర్ చెప్పడంతో దిల్ రాజు తనకు కాల్ చేసి అడిగారని రెండు రోజులు ఒక లొకేషన్ లో షూట్ చేశామని చెప్పారు శైలేష్ కొలను. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.