Hit 2: హీరో నాని, ప్రశాంతి త్రిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ‘హిట్’మూవీ విజయం సాధించడంతో ఇప్పుడు అదే ఫ్రాంచైజ్ లో ‘హిట్ 2’ను నిర్మిస్తున్నారు. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను దీనికీ దర్శకత్వం వహిస్తున్నాడు. బట్… హీరో మాత్రం మారిపోయాడు. ‘హిట్’లో విశ్వక్ సేన్ నటించగా, ఇప్పుడు అడివి శేష్ లేటెస్ట్ మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ను దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికరంగా ఓ వీడియో రూపంలో రివీల్ చేశాడు. ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ ఉరఫ్ విక్రమ్ రుద్రరాజు లేకపోవడాన్ని కొందరు ప్రశ్నించారని, అయితే అతన్ని వదిలేయలేదని, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఆపరేషన్ ను టేకప్ చేసినప్పుడు అతనూ రంగ ప్రవేశం చేస్తాడని వివరణ ఇచ్చాడు. కెప్టెన్ అమెరికా వస్తున్నాడని హల్క్ ను వదిలేయలేం కాదా! అలానే తాను విక్రమ్ రుద్రరాజును వదిలేయలేదని, ఇప్పుడు మాత్రం అడివి శేష్ ఉరఫ్ కృష్ణదేవ్ తో ఈ మూవీ తీస్తున్నానని సెలవిచ్చాడు. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. దాంతో అతనే ఈ ఆపరేషన్ కు కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ అనౌన్స్ మెంట్ లో ‘హిట్ వెర్సె’ వీడియోను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు శైలేష్ కొలను.
ఈ వీడియోతో డైరెక్టర్ హిట్ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశాడు. కె.డి పాత్రలో అడివి శేష్.. చాలా కూల్ కాప్‌గా ఎలా ఉంటాడో ఎలివేట్ చేశారు. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇందులో హిట్ 1 మరియు హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని కూడా రివీల్ చేశారు. ఈ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో డెవలప్ అవుతుందని తెలియజేశారు. చివరగా కూల్ కాప్ రోల్‌లో అడివి శేష్ ఎంట్రీ ఆశ్చర్యంతో స్టన్ అయ్యారు. మూవీ టీజర్ డేట్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ టీజర్‌ను బ్యాంగ్‌తో మేకర్స్ పూర్తి చేశారు. టీజర్‌ను చూస్తుంటే మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ లెవల్లో విడుదలకానుంది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్ స్టీవార్ట్ ఎడూరి సంగీతాన్ని అందిస్తున్నారు.
