NTV Telugu Site icon

Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…

Sailesh Kolanu

Sailesh Kolanu

సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ ప్లే చేయలేదు. కేవలం ట్రైలర్ లోనే వెంకీ మామ ఒక వంద మందిని చంపాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. సైంధవ్ ట్రైలర్ లోని బుల్లెట్ బాటమ్ హోల్ నుంచి బయటకి వచ్చే సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీన్ని వెంకీ మామ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. దీంతో శైలేష్ కొలను బయటకి వచ్చి ఒక ట్రోల్ వీడియోని చూసి బుల్లెట్ షాట్ పైన లాజికల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు.

“ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది… ఏ విషయాన్ని అయినా వివరించడం నాకు చాలా ఇష్టం కాబట్టి, నేను దీన్ని చెప్తాను. సాధారణంగా మీరు ఎవరినైనా నోటిలో కాల్చినట్లయితే, బుల్లెట్ తల వెనుక నుండి నిష్క్రమించాలి, కానీ మీరు వ్యక్తిని నిర్దిష్ట కోణంలో కూర్చోబెట్టి, తుపాకీ బారెల్‌ను తగినంతగా లోపలికి నెట్టి… నోరు మరియు బారెల్‌ను సుమారు 80 డిగ్రీల యాంగిల్ లో ఉండేలా షూట్ చేస్తే… బుల్లెట్ మీ అన్నవాహిక, ఆపై కాలేయం, ఆపై క్లోమం మరియు గుండెను పంక్చర్ చేస్తుంది, ఆపై నేరుగా పెద్ద మరియు చిన్న ప్రేగులను సరళ రేఖలో చీల్చుతుంది. ఆ తర్వాత పెద్దప్రేగులోకి ప్రవేశించి, శరీరం యొక్క దిగువ రంధ్రం ద్వారా నిష్క్రమిస్తుంది. దీనిని ఇంత పర్ఫెక్ట్ గా చేయడానికి చాలా అనుభవం అవసరం… ఇది సినిమాలో సైకో స్పెషల్ స్కిల్… థియరిటికల్ గా పాజిబుల్ కాబట్టి మాస్ మూమెంట్ క్రియేట్ చేసేసా…” అంటూ శైలేష్ కొలను ట్వీట్ చేసాడు. ఇంత లాజిక్స్ గా ఒక యాక్షన్ బిట్ ని కంపోజ్ చేయడం గొప్ప విషయం అనే చెప్పాలి. మరి సైంధవ్ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Show comments