Site icon NTV Telugu

Saif Ali Khan: నేను పెద్ద హీరోను కాను.. ఆదిపురుష్ హిట్ కాకపోవడం దురదృష్టం

Saif

Saif

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయనకు సెట్ లో ప్రమాదం జరగడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ దేవర సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సైఫ్.. నేపో కిడ్. తల్లిదండ్రులు నటీనటులే కాబట్టి.. సైఫ్ కూడా అదే రంగాన్ని ఎంచుకున్నాడు. మంచి మంచి పాత్రలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక సైఫ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా రేర్. తాజాగా సైఫ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అంతేకాకుండా ఆదిపురుష్ పరాజయం గురించి మొట్టమొదటిసారి స్పందించాడు. ఆదిపురుష్ లో రావణ్ గా సైఫ్ నటించాడు. సైఫ్ లుక్ పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.. దీనిపై కూడా సైఫ్ స్పందించాడు.

” నేను పెద్ద హీరోను కాను.. అలా ఎప్పుడు అనుకోలేదు కూడా. నా కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్నా కూడా నేను చాలా సింపుల్ గా పెరిగాను. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు రియాలిటీలో బతకాలని కోరుకుంటాను. ఓటమి వచ్చినా ఎదుర్కొని నిలబడగలగాలి అనుకుంటాను. నేను నటించిన ఆదిపురుష్ విషయాన్నే తీసుకోండి. లంకేశ్వరుడు గా చేస్తున్న సమయంలో అందరూ నన్ను వార్న్ చేశారు. రిస్క్ చేస్తున్నా అన్నారు. చాలామంది ట్రోల్ కూడా చేశారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు విజయాలు రాకపోవచ్చు. అధైర్యపడకూడదు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదు అనుకోవాలి. దాని గురించి ఆలోచించకుండా మరో సినిమాలో అంతకుమించిన రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సైఫ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version