Site icon NTV Telugu

Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..

Saif Ali Khan

Saif Ali Khan

Saif Ali Khan : సైఫ్‌ అలీఖాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్‌. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ కుమార్తె సాజిదా. సైఫ్ అలీఖాన్ కు ఈమె నానమ్మ అవుతుంది. హమీదుల్లా ఖాన్ పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్‌ దేశ విభజన టైమ్ లో పాకిస్థాన్ కు వెళ్లిపోయింది. సాజిదా మాత్రం ఇక్కడే ఇఫ్లిఖర్ అలీఖాన్ (సైఫ్‌ తాత)ను పెళ్లి చేసుకుంది. కాబట్టి హమీదుల్లా ఖాన్ ఆస్తులు తమవే అని ఎప్పటి నుంచో సైఫ్‌ కుటుంబం పోరాడుతోంది.

Read Also : Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..

కానీ హమీదుల్లా అసలు వారసురాలు పెద్ద కుమార్తె అని.. ఆమె పాకిస్థాన్ వెళ్లిపోయింది కాబట్టి ఈ ఆస్తులన్నీ ఎనిమీ ప్రాపర్టీలుగా గుర్తిస్తూ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 2015లోనే ప్రకటించింది. వాటిపై సైఫ్‌ అలీఖాన్ కుటుంబం కోర్టులో పిటిషన్ వేయగా.. తాజాగా కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా ఏడాదిలోగా ఈ ఆస్తులపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తుల్లో భారీ భవంతులు, ప్యాలెస్ లు, భూములు ఉన్నట్టు తెలుస్తోంది. వీటన్నింటి విలువ ఎంత లేదన్నా రూ.15వేల కోట్ల పై మాటే అని చెబుతున్నారు. దీంతో వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాడంటూ సైఫ్ మీద అప్పుడే పోస్టులు వెలుస్తున్నాయి. బాలీవుడ్ లో స్టార్ నటుడిగా ఎదిగిన సైఫ్‌.. ఇప్పుడు విలన్ గా నటిస్తూ పెద్ద సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు.

Read Also : Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!

Exit mobile version