Saif Ali Khan Fires At Paparazzi For Following Them: సినీ తారలు కనిపిస్తే చాలు.. వారి ఫోటోలను క్లిక్‌మనిపించేందుకు కెమెరామెన్లు ఎగబడుతుంటారు. కొందరైతే హద్దుమీరి, వారి వెంట పడుతుంటారు. అప్పటికే ఫోటోలకు పోజులిచ్చినా.. ఇంకా కావాలంటూ కెమెరామెన్లు వెంబడిస్తుంటారు. ఇక చాలని, తమని వెంబడించొద్దని చెప్పినా సరే.. వాళ్లు వినిపించుకోకుండా వెంటపడిపోతుంటారు. ఆ సమయంలో కోపం వచ్చినా సరే, ఏం చేయలేక మౌనంగానే వెళ్లిపోతుంటారు. కానీ, సైఫ్ అలీ ఖాన్ మాత్రం అలా చేయలేదు. కెమెరామెన్లు తమని విడిచిపెట్టకుండా వెంబడిస్తూనే ఉండటం వల్ల.. వారి మీద సీరియస్ అయ్యాడు. తమ బెడ్‌రూమ్‌లోకి రావాలని చురకలంటించాడు. అసలేం జరిగిందంటే..
Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్‌లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
సైఫ్ అలీ ఖాన్ తన భార్యతో కలిసి ఓ సెలెబ్రిటీ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. పార్టీ ముగించుకున్న అనంతరం తిరిగొస్తున్న సమయంలో.. కొందరు విలేకర్లు, కెమెరామెన్లు ఈ జోడీని వెంబడించారు. దాదాపు హోటల్ డోర్ దాకా వచ్చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సైఫ్.. ‘‘ఒక పని చేయండి, మా బెడ్‌రూమ్‌లోకి కూడా రండి’’ అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అయినా సరే.. మీడియా వాళ్లు వెనక్కు తగ్గకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఒకవేళ సైఫ్ లోపలికి వెళ్తూ ఆ డోర్ వేయకపోయి ఉంటే, బహుశా లిఫ్ట్ దాకా కూడా వెళ్లేవారేమో! చివరికి లిఫ్ట్ ఎక్కుతున్న సమయంలోనూ కేకలు పెట్టడంతో, చేసేందేం లేక సైఫ్ చిరునవ్వు చిందిస్తూ చేతులు ఊపాడు. వాళ్లు లిఫ్ట్ ఎక్కేదాకా.. కెమెరాలు ఆఫ్ అవ్వకపోవడం గమనార్హం. అఫ్‌కోర్స్.. సినీ తారలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, ఫోటోలు తీయడంలో తప్పు లేదు. కానీ, మరీ ఇలా వెంబడించడం ఏమాత్రం సబబు కాదు.
Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్
ఇంతకుముందు ఆలియా భట్, అనుష్క శర్మలు సైతం ఇలాగే కెమెరామెన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలియా తన ఇంట్లో కిటికీ వద్ద ఉన్నప్పుడు ఎవరో ఫోటోలు క్లిక్‌మనిపించి, వెంటనే సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే.. అనుష్క శర్మ తన బాల్కనీలో సరదాగా సమయం గడుపుతున్నప్పుడు కూడా కెమెరామెన్లు క్లిక్‌మనిపించారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వగా.. వాళ్లిద్దరూ మండిపడ్డారు. తమ ప్రైవసీకి భంగం కలిగించేలా ఇలాంటి ఫోటోలు తీయడం కరెక్ట్ కాదని, మళ్లీ ఇటువంటివి రిపీట్ చేయొద్దని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
#saifalikhan #KareenaKapoorKhan Ek Kaam Kariyega Hamare Bedroom me Aaiye ❤️ @viralbhayani77 pic.twitter.com/XXJVhSz4kP
— Viral Bhayani (@viralbhayani77) March 3, 2023
