Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా ఓ కామెంట్ చేశాడు. ప్రభాస్ తో తాను కలిసి నటించిన ఆదిపురుష్ సినిమాను తన కొడుకు తైమూర్ కు చూపించి సారీ చెప్పానని అన్నాడు. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరేమో సైఫ్ కు సపోర్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పించారు. తన కొడుకుకు అలా సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. ‘నేను ఆదిపురుష్ లో విలన్ గా చేశాను. అందులో కొంత భయపెట్టేలా కనిపిస్తాను. అందరితో యుద్ధాలు చేస్తాను. ఆ సినిమా నా కొడుకుకు చూపించాను. నువ్వు ఇలాంటి సినిమాలో హీరోగా చేయాలి. విలన్ గా చేయొద్దు అన్నాడు. సరే అని చెప్పాను’ అంటూ సైఫ్ చెప్పాడు.
Read Also : AP Govt: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి 180 రోజులు సెలవులు!
‘ఆ సినిమాలో విలన్ గా చేసినందుకు నా కొడుకుకు సారీ చెప్పాను. అంతే తప్ప ఆ సినిమాను తక్కువ చేయడానికి కాదు. నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల లాగే ఆదిపురుష్ ను కూడా గౌరవిస్తాను. అంతే తప్ప తక్కువ చేయను’ అంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సైఫ్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.
Read Also : Prakash Raj : బాలీవుడ్ స్టార్లు అమ్ముడుపోయారు.. ప్రకాశ్ రాజ్ సంచలనం..
