చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛార్మింగ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ కు లేడీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లు మహేష్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను కూడా మహేష్ బాబు అభిమానినే అని నిరూపించుకొంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి.. ఒక స్టార్ డమ్ వచ్చాకా అందరిలా అన్ని ప్రదేశాల్లో తిరగలేరు హీరోయిన్లు.. ఇక మరి ముఖ్యంగా సినిమా థియేటర్లలో అంటే అస్సలు కుదరదు. మల్టీ ప్లెక్స్ మాల్స్ లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోరు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తారు. కానీ మహేష్ మీద అభిమానం ఉండాలే కానీ ఎలా అయినా సినిమా చూడొచ్చు అని సాయి పల్లవి నిరూపించింది.
హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్ లో `సర్కారు వారి పాట` సినిమాకు దొంగలా నక్కి వచ్చి చూసి అమాయకురాలిగా వెళ్లిపోయింది. గత రాత్రి పీవీకే ఆర్కే సినీ ప్లెక్స్ లో సాయి పల్లవి మహేష్ సినిమా చూడడానికి వచ్చింది. ముఖానికి స్కార్ఫ్ అడ్డుపెట్టుకొని, చేతిలో బ్యాగ్ తో ఎవరికి అనుమానం రాకుండా కారు దగ్గరకు వెళ్ళిపోయింది. అయితే అక్కడే ఉన్న కెమెరాలు మాత్రం వదులుతాయా.. ఇదుగో ఇలా ఫోటోలు క్లిక్ మనిపించాయి. అయితే ఇదేమి సాయి పల్లవి కి కొత్తేమి కాదు.. గతంలో భీమ్లా నాయక్ కూడా అమ్మడు ఇదే రీతిలో వెళ్లి షాక్ ఇచ్చింది. అయితే మహేష్ కు తానూ పెద్ద అభిమానిని అని చెప్పడంతో ఈ సినిమా ఆమెకు కొంచెం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
