Site icon NTV Telugu

Virata Parvam: ట్విటర్ సాక్షిగా.. అంత సీన్ లేదన్న సాయి పల్లవి

Sai Pallavi On Virata Parvam

Sai Pallavi On Virata Parvam

ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ‘విరాటపర్వం’ సినిమా.. వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రిలీజ్‌కి ముస్తాబవుతోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అనూహ్యమైన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు కూడా చాలా డిఫరెంట్‌గా ఓ వీడియో రూపంలో ఇచ్చారు.

ఈ వీడియోలో ఓ అభిమాని (30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్) రానా ఆఫీస్ వద్దకు వెళ్లి కాస్త హంగామా చేస్తాడు. ఇంతలో రానా బయటకు రాగానే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ, ప్రమోషన్స్ ఏవీ? అని అడుగుతాడు. ఆ తర్వాత సాయి పల్లవిని చూడ్డానికి వెయిటింగ్ అని, తాను ఆ హీరోయిన్ అభిమానినని చెప్తాడు. అందుకు రానా బదులిస్తూ.. తాను కూడా సాయి పల్లవి అభిమానినే అని, అసలు ఆమె కోసమే ఈ సినిమా తీశామని చెప్తాడు. ఆమె ఫ్యాన్స్ కోసం కర్నూలులో జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నామని పేర్కొంటాడు. ఈ ఈవెంట్‌కి సాయి పల్లవి కూడా వస్తుందని చెప్పుకొస్తాడు.

ఈ ప్రమోషనల్ వీడియో చూసిన సాయి పల్లవి.. ‘‘ఇక్కడ అంత సీన్ లేదండి, ప్రజల ప్రేమను పొందుతోన్న నేనే చాలా అదృష్టవంతురాలిని. కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇదిలావుండగా.. రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు. డి. సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version