‘ఫిదా’ చిత్రంతో ఫిదా చేసిన బ్యూటీ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేసింది లేదు. దీంతో సినిమాలకు దూరమైన సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడంలేదని వార్తలు గుప్పమన్నాయి. ఇక దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆ వార్తలపై ఆగ్రహము వ్యక్తం చేశారు. మంచి కథలను ఎంచుకొనే ఆమె అలాంటి కథలను ఎంచుకోవడానికి కొద్దిగా టైమ్ పడుతోంది. మాటలోనే ఆమెకు పెళ్లి చేసేస్తారా..? ఒక సినిమా అవ్వగానే మరో సినిమా సైన్ చేయాలనీ రూల్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు.
ఇక కొన్నిరోజుల నుంచి వస్తున్నా ఈ వార్తలకు సాయి పల్లవి గట్టి సమాధానం ఇచ్చింది. నిన్నటికి నిన్న ఆమె నటించిన విరాట పర్వం రిలీజ్ డేట్ ను ప్రకటించగా.. తాజాగా తన కొత్త సినిమా అప్డేట్ ను రివీల్ చేసి పెళ్లి వార్తలకు చెక్ పెట్టింది. “ఆమె మిమ్మల్ని ఆశ్చర్యపరిచింది.. కొంతకాలం దాక్కుంది.. ఇక ఆమె సోమవారం మిమ్మల్ని చూడడానికి సిద్ధంగా ఉందని అనుకుంటున్నాను.. మే 9 న కలుద్దాం” అంటూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఇక ఆ ఫొటోలో సాయి పల్లవి కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. సింపుల్ చీర,, నార్మల్ చెప్పులు, ఒక బ్యాగ్ తో గాల్లో ఎగురుతూ కనిపించింది. ఈ పోస్టర్ తో ఇది కూడా ఆమెకు పేరుతెచ్చే సినిమాలనే అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.
She’s a surprise, kept hidden for a while now! I think she’s ready to see you this Monday, the 9th of May🙈 pic.twitter.com/4wiaIqejqn
— Sai Pallavi (@Sai_Pallavi92) May 7, 2022
