Site icon NTV Telugu

Prabhas : ‘కల్కి 2’లో ప్రభాస్ సరసన సాయి పల్లవి

Kalki 2

Kalki 2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి  ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. కానీ కల్కి 2 లో ఆమెను కొన్ని కారణాల వలన తప్పించారు. ఇప్పుడు దీపికా పదుకొణె పోషించిన కీలక పాత్రకోసం సీక్వెల్ లో ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Ram Charan : మెగా ట్విన్స్ కు స్వాగతం పలికేందుకు డేట్ ఫిక్స్

‘కల్కి’ మొదటి భాగంలో దీపికా పదుకొణె పాత్ర కథలో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ‘కల్కి 2’లో ఆ పాత్రకు ముగింపు పలికి అందుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. అందుకే సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారని సమాచారం. సాయి పల్లవి తన సహజ నటన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించగలదు. ఆమెకు ఉన్న న్యాచురాలిటీ, డాన్స్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాత్రకు బాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే దీపిక పాత్రను కొత్త కోణంలో చూపించేందుకు సాయి పల్లవి సరైన ఎంపికగా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్–నాగ్ అశ్విన్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, సాయి పల్లవి చేరిక నిజమైతే ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరగడం ఖాయం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version