Sai Pallavi: పుట్టినరోజు నాడు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిదా చిత్రంతో తెలుగు వారి గుండెల్లో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలు, గ్లామర్ పాత్రలకు నో చెప్పడం, హీరోలతో ఇగో క్లాష్ లు ఇలా తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోకుండా తన క్యారెక్టర్ తో ఇంకో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్ గానే కాకుండా విలువలు గల హీరోయిన్ గా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్న ఈ బ్యూటీ నేడు తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటుంది. ఈ సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ను తెలిపింది. గతేడాది శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంతో హిట్ అందుకున్న ఈ భామ ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదని, ఆమెకు పెళ్లికి రెడీ అయ్యిందంటూ వార్తలు గుప్పుమంటున్న వేళ.. నేడు ఆ వార్తలకు చెక్ పెడుతూ కొత్త సినిమా అప్డేట్ ను తెలిపింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గార్గి’. బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ రామచంద్రన్ – ఐశ్వర్య లక్ష్మీ – థామస్ జార్జ్ – గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక నేడు సాయి పల్లవి పుట్టినరోజును పురష్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ వీడియోలో సాయి పల్లవి సాంప్రదయకంగా చీరకట్టుతో కనిపించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో లో ‘నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదుగా ఆడపిల్లను’ అని సాయి పల్లవి చెప్పే డైలాగ్ తో ఈ సినిమా కథ ఎంతో సున్నితంగా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక గోవింద్ వసంత సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?