న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి పల్లవి కంట నీరు పెట్టుకోంది.
మలయాళ భామగా తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ ఫిదా చిత్రంతో అందరి మనసులను కొల్లగొట్టింది. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇక ఒక హీరోయిన్ పేరు వినగానే ఫ్యాన్స్ అంతలా అరవడం చాలా అరుదని తెలుస్తోంది. ఇంతటి అభిమానుల ప్రేమను చూసిన సాయి పల్లవి స్టేజిపైనే ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.