Site icon NTV Telugu

Kalki2898AD : కల్కి సీక్వెల్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ చేస్తున్న నాగ్ అశ్విన్?

Kalki

Kalki

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్‌లో దీపికా కనిపించబోరని స్పష్టం చేశారు.

దీంతో ఈ సినిమాలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మొదట ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆమె ప్రాజెక్టుల బిజీ కారణంగా అందుబాటులో లేరని సమాచారం. ఇప్పుడు ఈ రోల్ కోసం సాయి పల్లవిని ఆలోచిస్తున్నారని సినీ వర్గాల టాక్. సాయి పల్లవి యాక్టింగ్‌కి ఉన్న డెప్త్, ఆమె ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిపోతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడని తెలుస్తోంది.

మరి నాగ్ అశ్విన్ నిజంగానే సాయి పల్లవిని ఈ పాత్ర కోసం అప్రోచ్ అవుతాడా? సాయి పల్లవి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం సస్పెన్స్ కొనసాగనుంది.

Exit mobile version