దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉండేవి. అయితే, ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కావడం, అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించడం, సాయి పల్లవి హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కానీ మే 1న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు కేవలం రూ. 1.37 కోట్ల నెట్ వసూళ్లు రాగా, రెండో రోజు ఆ సంఖ్య రూ. 1 కోటికి పడిపోయింది.
ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. ఓవర్సీస్‌లో రెండు రోజులకు కలిపి కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. మూడో రోజు వసూళ్లు మరింత క్షీణించడంతో, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను ‘డిజాస్టర్’గా ప్రకటించే దిశగా ఉన్నాయి. సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ నటించిన సినిమా ఇంత తక్కువ వసూళ్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.
