ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్‌ల బర్త్‌డే కి.. వారి అప్‌కమింగ్ చిత్రాల నుండి వారికి సంబంధించిన అప్ డేట్ లు వదులుతూ వస్తున్నారు. కానీ రీసెంట్‌గా నెచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ‘రామాయణ’ టీమ్ నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి లుక్ లేదా చిన్న టీజర్ రిలీజ్ చేస్తారనే అంచనాలు బలంగా వినిపించాయి. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
దీపావళి రిలీజ్‌ను నిర్మాతలు పదే పదే కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోవడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో దీనిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ‘ఏక్ దిన్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. జునైద్ ఖాన్‌తో కలిసి చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కొంతమంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ పాత్ర తనకు పూర్తిగా సెట్ అవుతుందో లేదో ముందే సందేహం వచ్చిందని సాయిపల్లవి చెప్పడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దీనికి తోడు..
ఇటీవల వచ్చిన ‘రామాయణ’ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా VFX విషయంలో సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో, టీమ్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకెళ్తోందట. ఇలాంటి సమయంలో మరో కంటెంట్ విడుదల చేసి మళ్లీ ట్రోలింగ్‌కు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సాయిపల్లవి బర్త్‌డే అప్డేట్‌ను హోల్డ్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేసి ఉంటే అభిమానులు ఆనందపడేవారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
