Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్‌ల బర్త్‌డే కి.. వారి అప్‌కమింగ్ చిత్రాల నుండి అప్‌డేట్‌లు వదులుతూ వస్తున్నారు. కానీ రీసెంట్‌గా నెచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ‘రామాయణ’ టీమ్ నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి లుక్ లేదా చిన్న టీజర్ రిలీజ్ చేస్తారనే అంచనాలు బలంగా వినిపించాయి. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
దీపావళి రిలీజ్‌ను నిర్మాతలు పదే పదే కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోవడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ‘ఏక్ దిన్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. జునైద్ ఖాన్‌తో కలిసి చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కొంతమంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ పాత్ర తనకు పూర్తిగా సెట్ అవుతుందో లేదో ముందే సందేహం వచ్చిందని సాయిపల్లవి చెప్పడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దీనికి తోడు..
Also Read
- Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
ఇటీవల వచ్చిన ‘రామాయణ’ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా VFX విషయంలో సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో, టీమ్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకెళ్తోందట. ఇలాంటి సమయంలో మరో కంటెంట్ విడుదల చేసి మళ్లీ ట్రోలింగ్‌కు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సాయిపల్లవి బర్త్‌డే అప్డేట్‌ను హోల్డ్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేసి ఉంటే అభిమానులు ఆనందపడేవారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
-
Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!