NC 23: మరోసారి కలిసి నటించనున్న సాయి పల్లవి-నాగ చైతన్య…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య 2023ని ఫ్లాప్స్ తో ఎండ్ చేసి… 2024లో సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ కొడితే సరిపోదు, టైర్ 2 హీరోల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యే రేంజులో, దెబ్బకి టైర్ 1 హీరోల్లో చేరిపోయే రేంజులో హిట్ కొట్టాలి. ఇప్పుడు ఈ రేంజ్ హిట్ కే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ప్రేమమ్ సినిమాని డైరెక్ట్ చేసిన చందూ మొండేటితో కలిసి పాన్ ఇండియా సినిమాని సెట్ చేసాడు నాగ చైతన్య. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి, జాలర్ల నేపథ్యంలో సాగనున్న కథతో సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ #NC23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
#NC23 అనౌన్స్మెంట్ నుంచే బజ్ ని జనరేట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే జాలర్లని కలిసి మాట్లాడిన టీమ్, త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీకి సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి… NC23 సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఓకే చెప్పాడు అనే న్యూస్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే NC23 సినిమా హాఫ్ సక్సస్ అయినట్లే. అనిరుధ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ కి NC23 మ్యూజిక్ ఏ రేంజులో ఉంటుందో ఊహించొచ్చు. NC23 గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో వార్త… నాగ చైతన్య పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందనే విషయం. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న సాయి పల్లవి… నాగ చైతన్య-చందూ మొండేటి సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి రానుందని సమాచారం. నాగ చైతన్య-సాయి పల్లవి కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాతో ఇద్దరి కెరీర్స్ బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇప్పుడు సాయి పల్లవి మరోసారి నాగ చైతన్యతో పెయిర్ అప్ అయితే అది NC23 ప్రాజెక్ట్ కి హిట్ కళని తీసుకోని వస్తుంది. మరి అటు అనిరుధ్… ఇటు సాయి పల్లవి… ఈ ఇద్దరూ #NC23 ప్రాజెక్ట్ లో ఉంటారో లేదో చూడాలి.
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
తాజావార్తలు
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!