మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే స్టైలిష్ లుక్ ఫోటోషూట్ తో వర్క్ కి కూడా సిద్ధమని తెలిపాడు. ప్రస్తుతం కథలను వింటున్న తేజు.. రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే దేవుడు గురించి, టైమ్ గురించి ఇటీవల నాన్ స్టాప్ గా ట్వీట్స్ వేస్తున్న ఈ హీరో తాజగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. ” గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్” అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసిన తేజు క్యాప్షన్ గా ” మీ జీవితంలో అత్యుత్తమ స్క్రీన్ ప్లేను ముందే రాసి ఉంచుతాడు. ఆయనను విశ్వసించి ముందుకు సాగండి..మీ మార్గంలో ఏది అయితే వస్తుందో దాన్ని తీసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు.
సమయం కానీ సమయంలో ఈ పోస్ట్ కి అర్ధం ఏంటి అని అభిమానులు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ పోస్ట్ వెనుక భీమ్లా నాయక్ విజయం ఉందని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు. సినిమా మొదటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది ఆపాలని చూసినా.. ఆగలేదు.. హిట్ అవ్వదు.. కలెక్షన్స్ రావు అని అనుకుంటే.. సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఇదంతా దేవుడు ప్లాన్.. ఆయన సమయం ఎప్పటికీ పర్ఫెక్ట్ అనే అర్థంలో తేజు ఈ ట్వీట్ ని పెట్టి ఉంటాడని అంటున్నారు. దేవుడ్ని నమ్మి ముందడుగు వేయడంతో భీమ్లా నాయక్ ఇంతటి విజయాన్ని సాధించింది అని చెప్పకనే చెప్తున్నాడు అంటున్నారు అభిమానులు. ఏదిఏమైనా డైరెక్ట్ గా చెప్పినా ఇన్ డైరెక్ట్ గా చెప్పినా మెగా మేనల్లుడు.. పవన్ మామకు సపోర్ట్ గా ఉండడం మాత్రం పవన్ అభిమానులకు కొండత ధైర్యాన్నిస్తుంది.
