Site icon NTV Telugu

Sai Dharam Tej: ‘జల్సా’ థియేటర్ లో సుప్రీం హీరో రచ్చ..

Tej

Tej

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పటినుంచి పవన్ డై హార్ట్ ఫ్యాన్ అన్న విషయం విదితమే. ఈ విషయాన్నీ తేజ్ ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు. చిన్న మామ వ్యక్తిత్వం అంటే మరీ ఇష్టమన్న తేజ్.. ఆయనలానే సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటాడు. అందుకే పవన్ ఫ్యాన్స్ కు తేజు అంటే వల్లమాలిన అభిమానం. ఇక నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా తేజు కూడా పవన్ ఫ్యాన్ గా మారిపోయాడు. పవన్ బర్త్ డే స్పెషల్ షో జల్సా సినిమాను సంధ్య 70 ఎంఎం లో అభిమానుల మధ్య వీక్షించాడు.

మెడలో మామ సిగ్నేచర్ ఎర్ర కండువా వేసుకొని బస్తా పేపర్లతో కనిపించాడు. ఇంకేముందు అభిమానులతో పాటు పవన్ పై పేపర్లు జల్లుతూ, ఎగురుతూ, విజిల్స్ వేస్తూ ఒక పవన్ ఫ్యాన్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలాగే నడుచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై పవన్ ఫ్యాన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. తేజ్ అన్నా నువ్వు సూపర్ అని కొందరు. అసలైన పవన్ ఫ్యాన్ అంటే ఇలాగే ఉండాలి అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక తేజ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతాయాం రీమేక్ లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version