NTV Telugu Site icon

Virupaksha: నీకు పోటీనే లేదు బ్రో… హిట్ టాక్ వస్తే చాలు…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్, గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్, టీజర్ ని పవన్ కళ్యాణ్, ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చెయ్యడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. ఆ రీచ్ ని కాపాడుకుంటూ మేకర్స్ విరుపాక్ష ప్రమోషన్స్ ని చాలా బాగా చేశారు. సంయుక్త మీనన్ గ్లామర్ విరుపాక్ష సినిమాని యూత్ కి కనెక్ట్ చేసేలా ఉంది. పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీని తెలుగులో మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్, ఇక్కడ హిట్ కొట్టి ఆ తర్వాత బయటకి వెళ్తారేమో.

మాములుగా అయితే ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ ఉంటుంది. ఈ వీక్ మాత్రం పరిస్థితి అలా లేదు, విరుపాక్ష సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పుడు విరుపాక్ష సినిమాపై ఉన్న అంచనాలకి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు మెగా ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ విరుపాక్ష సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ వరకూ ఈజీగానే తీసుకోని వెళ్తారు. ఆ తర్వాతి వారంలో అఖిల్ ఏజెంట్ సినిమా, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి విరుపాక్ష సినిమాకి థియేటర్స్ తగ్గే ప్రమాదం ఉంది. సో మొదటి వారంలోనే విరుపాక్ష సినిమా వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టగలగాలి. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది కాబట్టి ఈ మూవీని చూడడానికి ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్లతో పాటు మిగిలిన ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి రాబట్టాలి అంటే విరుపాక్ష సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, లేదంటే ఒక వర్గానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది.

Show comments