NTV Telugu Site icon

Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో

Tej

Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తేజ్ అని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా.. అని తేడా లేకుండా ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తేజ్ ముందు ఉంటాడు. గొప్పలకు పోకుండా..నిజాలను ఒప్పుకోగల సత్తా ఉన్నోడు. ఇక రెండేళ్ల క్రితం తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి అందరికి తెల్సిందే. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దేవుడి దయవలన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ యాక్సిడెంట్ తరువాత తేజ్ లో చాలా మార్పు వచ్చింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాకా జీవితం విలువ తెల్సిందని, తన కుటుంబం తనకు ఎంత అండగా ఉన్నదో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు. తాను మాట్లాడడానికి, నడవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో కూడా చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా తనలా బాధపడుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ కు తేజ్ ధైర్యాన్ని ఇచ్చాడు.

Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా

రిషబ్ కు గతేడాది కార్ యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. ఆయన కూడా చావు అంచుల వరకు వెళ్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కొన్నిరోజులుగానే నడవడం నేర్చుకుంటున్నాడు. తాజాగా రిషబ్.. మెట్లపై అడుగులు వేస్తూ నడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. “అంత చెడ్డ విషయమేం కాదు రిషబ్.. కొన్నిసార్లు సింపుల్ పనులు కూడా కష్టంగా ఉంటాయి” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై తేజ్ స్పందిస్తూ ” మొదటి అడుగు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న నీ కష్టాల కంటే నీ చివరి గమ్యం మరింత విలువైనది.. కామాన్ ఛాంప్.. నువ్వు చేయగలవు” అంటూ రాసుకొచ్చాడు. ఒక మనిషికి ధైర్యాన్ని చెప్పే మాటలు కన్నా మించిన సాయం మరొకటి ఉండదు. తాను పడిన కష్టం.. ఇప్పుడు రిషబ్ అనుభవిస్తుంటే.. అతనికి దైర్యం చెప్పిన తేజ్ మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో అని కొందరు.. ఇద్దరూ ఛాంప్స్ యే బ్రో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం తేజ్ బ్రో సినిమాలో నటిస్తున్నాడు.