Site icon NTV Telugu

Vinaro Bhagyamu Vishnu Katha: సీడెడ్ కుర్రాడి కోసం వస్తున్న సుప్రీమ్ హీరో…

Vinaro Bhagyamu Vishnu Katha

Vinaro Bhagyamu Vishnu Katha

సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సాంగ్స్, టీజర్ తో మంచి ఎక్స్పెక్టేషన్ ని సెట్ చేసిన మేకర్స్, ట్రైలర్ లాంచ్ ని కూడా గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7 సాయంత్రం 5 అయిదు గంటలకి రిలీజ్ చెయ్యనున్న ట్రైలర్ కి లాంచ్ ఈవెంట్ సెట్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గెస్టుగా రానున్నాడు.

#SDTforVBVK అనే టాగ్ ని క్రియేట్  చేసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైప్ పెంచుతున్నారు బన్నీ వాసు అండ్ టీం. ప్రస్తుతానికైతే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ట్రైలర్ తో ఇంకాస్త బజ్ ని జనరేట్ చెయ్యగలిగితే కిరణ్ అబ్బవరం మంచి ఓపెనింగ్స్ చూసే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీకి సమంతా శాకుంతలం, విశ్వక్ సేన్ ధమ్కీ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. నైజాంలో విశ్వక్ సేన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సీడెడ్ ఏరియాని టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకూ జోనర్ చెప్పకుండా ఊరిస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం, ట్రైలర్ తో అయినా వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ఏ జోనర్ కి చెందుతుంది అనే విషయంలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version