NTV Telugu Site icon

Sai Dharam Tej: మెగా ఫ్యామిలీని బాగా వాడేశా.. అందుకే ఎన్టీఆర్ తో

Ntr

Ntr

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా వరుస ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నాడు. ఇంకోపక్క సోషల్ మీడియాలో ఈ సినిమాలో సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మేకర్స్ సైతం మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. విరూపాక్ష.. టీజర్ రిలీజ్ నుంచే సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు కారణం ఎన్టీఆర్. టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మెగా, నందమూరి ఫ్యాన్స్.. ఈ సినిమాపై అటెన్షన్ పెట్టేశాయి. అయితే ఆ సమయంలోనే తేజ్ పై విమర్శలు కూడా మొదలయ్యాయి. మెగా కుటుంబంలో అంతమంది హీరోలను పెట్టుకొని.. తేజ్, ఎన్టీఆర్ సాయం అడిగాడు ఏంటి అంటూ అనేక అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ప్రశ్నకు తేజ్ సమాధానం చెప్పుకొచ్చాడు.

Shama Sikander: లోపల బ్రా లేకుండా ఏంటీ షామా.. అవకాశాల కోసం ఇంతలా

” యాక్సిడెంట్ తరువాత మెగా కుటుంబం మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు అనుకున్నాం.. మీరేమో ఎన్టీఆర్ ను తీసుకొచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.” అన్న ప్రశ్నకు తేజ్ మాట్లాడుతూ.. ” నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలిచింది. రిపబ్లిక్ సినిమాను వాళ్లే ప్రమోట్ చేశారు. ఫస్ట్ లుక్ ను చరణ్ లాంచ్ చేశాడు. ట్రైలర్ ను చిరంజీవి గారు లంచ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చారు. రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. మా తమ్ముడు వైష్ణవ్ అన్నింటా ఉన్నాడు. నా కోసం వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఇంకా వారిని ఎక్కువ అడగాలేను. వారిని మరీ ఎక్కువ వాడేస్తున్నా అని నా ఫీలింగ్ నాకుంది. వాళ్ళను ఎక్కువ వాడకూడదు. నేనేం చేసినా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుంది. వాళ్ళు కాకుండా ఎవరు ఉన్నారు అని అంటే .. తారక్. ఎన్టీఆర్ నాకు ఇండస్టర్ రాకముందు నుంచి నా ఫ్రెండ్. నా బాగు కోరుకొనేవారిలో మొదటివాడు. అందుకే నన్ను మళ్లీ ఇండస్ట్రీకి పరిచయం చేయమని అడిగాను. ఆయన వాయిస్ ఓవర్ తోనే విరూపాక్ష అనే సినిమా స్టార్ట్ అయ్యింది. తనెప్పుడు నా వెల్ విషర్. నాకెప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు. అందుకే తనతోపాటే వచ్చాను బయటికి. తారక్ , నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఎప్పటి నుంచో క్లోజ్.. చాలా మంది చాలా అనుకుంటారు కానీ తప్పుగా.. తెలుగు ఇండస్ట్రీ లాంటి కుటుంబంలా మేము ముందుకు వెళ్తున్నాం.. అతను మాకు మద్దతు ఇచ్చినప్పుడు అది మరింత పెరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్ కు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments