Sai Dharam Tej: జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, మంచి కథలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఆయన జీవితంలో పెద్ద కుదుపు. అదే రోడ్ యాక్సిడెంట్. రెండేళ్ల క్రితం తేజ్ కు కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. ప్రాణాలతో బయటపడడేమో అని అనుకున్నారు. కానీ, దేవుడి దయవలన, ప్రేక్షకుల ప్రార్థనల వలన తేజ్ బయటపడ్డాడు. దాదాపు ఆరునెలలు బెడ్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్న తేజ్.. ఒక ఇంటర్వ్యూలో అప్పటి సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. ఆయన నటించిన విరూపాక్ష సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని విప్పాడు.
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?
“అదొక పెద్ద యాక్సిడెంట్.. నేను కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. అప్పటివరకు సోషల్ మీడియా ఓపెన్ చేయలేదు. ఆ తరువాత ఓపెన్ చేసి చూస్తే.. నీ పని అయిపోయినట్టే.. రిటర్మెంట్ తీసుకున్నావా..? అంటూ జోకులు వేశారు. నేను కావాలని గ్యాప్ తీసుకున్నది కాదు.. ఆ గ్యాప్ వచ్చింది. ఇంట్లో ఆ సమయంలో అన్ని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని. బొమ్మలతో ఆడుకొనేవాడిని. ఈ ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది. నాలో చాలా మార్పులు వచ్చాయి. యాక్సిడెంట్ తరువాత నా మాట పడిపోయింది. అసలు నోరు పెగిలేది కాదు.చాలా భయమేసింది. నేను అలా మాట్లాడితే.. మంచు కొట్టి వచ్చావా..? మాట పడిపోయిందా..? అని జోకులు వేశారు. ఆ సమయంలో నేను నా మాట రావడానికి ఎంత బాధను అనుభవించానో నాకే తెలుసు. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు.. నా చుట్టుపక్కల వారు ఎంతో సపోర్ట్ చేశారు. నేను మాట్లాడిన మాటలు అర్ధం కాకపోతే.. పర్లేదు.. ఇంకోసారి అర్థమయ్యేలా చెప్పు అని అనేవారు. సెట్ లో కూడా రెండు పేజీల డైలాగ్స్ టకాటకా చెప్పేవాడిని, ఇప్పుడు సగం పేజీనే చెప్పలేకున్నా.. యాక్టర్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఇన్ని ట్రోల్స్ వచ్చినా నేను పట్టించుకోలేదు.. దైర్యంగా నిలబడడం నేర్చుకున్నా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
