NTV Telugu Site icon

Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది

Sai Dharam Tej On Virupaksh

Sai Dharam Tej On Virupaksh

Sai Dharam Tej Reveals Interesting Things About Virupaksha: రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్.. త్వరలోనే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈసారి తాను చేసిన రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాయి తేజ్ సరికొత్త త్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో త్రిల్ చేయబోతున్నాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది ఈనెల 21వ తేదీన రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసింది.

Rainbow: రెయిన్‌బోకి ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదు.. ఎవరో తెలుసా?

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ‘క్యారెక్టర్స్ ఇంట్రో ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తొలుత తాను అందరి దీవెనలు, ప్రార్థనలతో తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని స్పష్టం చేశాడు. అనంతరం.. ఈ సినిమా స్క్రిప్ట్ వినాల్సిందిగా మొదట తనని సుకుమార్ 2019లో రికమెండ్ చేశాడని చెప్పాడు. సుకుమార్ చెప్పడంతో తాను ఈ స్టోరీ విన్నానని.. కార్తిక్ నరేషన్ వినగానే ఈ చిత్రం తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం తనకు కలిగిందని తెలిపాడు. విరూపాక్ష ఒక గొప్ప సినిమా అని పేర్కొన్న సాయి తేజ్.. ఈ చిత్రం కోసం ఒక అద్భుతమైన ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసినందుకు టెక్నికల్ టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక అంజనీష్ లోక్‌నాథ్ సమకూర్చిన సంగీతం విని, తాను అతనికి అభిమానిని అయ్యానన్నాడు.

Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!

ఇక విరూపాక్షలో నటించిన తన తోటి నటీనటులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారని.. ఇందులో కీలక పాత్రలు పోషించిన నటీనటుల స్మారకార్థం ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగిందని సాయి తేజ్ స్పష్టం చేశాడు. డైలాగ్ డెలివరీలో తన పర్సనల్ టీమ్ ఎంతో సహాయం చేసిందని.. దర్శకుడు సుకుమార్ కూడా తనకు సపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందంటూ తన ప్రసంగాన్ని సాయి తేజ్ ముగించాడు. కాగా.. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించాయి.