సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు.
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో “సరిహద్దుల్లో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించే మా సైనికులను మేము గౌరవిస్తాము. వారి పరాక్రమం, త్యాగం గురించి చూశాము, విన్నాము. అదే సమయంలో దేశంలోని అంతర్గత శత్రువుల చేతిలో నుండి దేశాన్ని రక్షించడానికి జిల్లా కలెక్టర్లు రోజూ పోరాడుతున్నారు. ఆ పోరాటంలో కొందరు గెలిచారు. కొందరు తమ జీవితాలను కూడా కోల్పోయారు. మనలో ఎంతమందికి వారి గురించి తెలుసు? వారికి నివాళులు అర్పించడానికి, వారి కథలను వెలుగులోకి తీసుకురావడానికి మేము “థాంక్యూ కలెక్టర్ స్టోరీస్” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము” అంటూ వీడియో ద్వారా వెల్లడించారు.
Read Also : “ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు.
