“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?

యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడని ప్రకటించిన మేకర్స్ ఆయన స్థానంలో ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read Also : షాకింగ్ : సినీ ఫక్కీలో మోసపోయిన “సాహో” బ్యూటీ…!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్స్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి డజనుకు పైగా భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు స్వరాలు సమకూరుస్తున్నారు. అందులో ” ఏజెంట్” కూడా ఉంది. అయితే తమన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు అందుబాటులో లేరట. ఈ కారణంగానే మేకర్స్ మ్యూజిక్ కంపోజర్‌ను మార్చారని తాజా అప్‌డేట్. “ఏజెంట్” కోసం హిప్‌హాప్ తమిజాను రంగంలోకి దింపారట. హిప్‌హాప్ తమిజా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్ లో పని చేయడం ప్రారంభించాడట. ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి ఈ ఏడాది చివరిలోపు షూట్ పూర్తి చేసి “ఏజెంట్”ను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-