సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్… ఇటీవల కాలంలో వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో కన్పించారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఆ తరువాత బయట కన్పించలేదు. అప్పుడప్పుడూ ఫొటోలతోనే అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. ఇక ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం తేజ్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కన్పిస్తోంది. ఇప్పుడు తేజ్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Read Also : Prabhas Treat : జీర్ణించుకోలేం అంటూ బిగ్ బీ పంచులు