Sai Dharam Tej: టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, మెగా కుటుంబం సమక్షంలో వీరి పెళ్లి అంగరంగవైభంగా జరిగింది. వారి పెళ్లి జరిగి దాదాపు 15 రోజులు కావోస్తోన్నా.. ఇప్పటికీ వరుణ్-లావణ్యల పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వివాహ వేడుకలోని బెస్ట్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్‌కి అతడు పెట్టిన పోస్ట్ నెటిజన్లను, మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. చూస్తుంటే తేజ్.. వరుణ్ పెళ్లిలో బాగానే హంగామా చేసినట్టు కనిపించాడు.
Read Also: Nikhil Siddhartha : తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ..?
ఇంతకి తేజ్ పోస్టులో ఏముందంటే..
ఈ పోస్టులో సాయి ధరమ్ తేజ్ ఏం రాసుకొచ్చాడంటే.. పెళ్లిలో వరుణ్ తేజ్ కొత్త పెళ్లికొడుకుగ్గా ముస్తాబై కారులో ఊరేగుతూ వస్తున్నాడు. ఆ కారుకు అడ్డుపడుతూ ఈమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఎంతపని చేశావురా వరుణ్ అంటూ ఆటపట్టించినట్టుగా కనిపించాడు. ఆ కారుపై కాలు పెట్టి మాకేంటి ఇది.. అన్నట్టుగా ప్రశ్నిస్తుంటే.. కారు లోపల వరుణ్ మాత్రం చిరునవ్వు చిందిస్తున్నాడు. ఇదే ఫొటోను షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు తేజ్. ‘ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంతపని చేశావు రా వరుణ్ బాబు.. ఉష్.. నీకు పెళ్లి సంబరాలు.. నాకేమో స్వతంత్ర్య పోరాటం’ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం తేజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ నువ్వు ఎప్పుడు గుడ్‌న్యూస్ చెప్తావ్ అన్నా.. అని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. రీఎంట్రీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో సినిమాతో అలరించాడు.
Read Also: Somireddy Chandramohan Reddy: జగన్, విపత్తులు.. కవల పిల్లలు..! ఆయన సీఎం అయ్యాక 9 విపత్తులు..!