NTV Telugu Site icon

Sai Dharam Tej: మెగా మేనల్లుడు లుంగీ వెనుక ఉన్న రహస్యం ఇదా..?

Tej

Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఆ యాక్సిడెంట్ తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన తేజ్.. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక విరూపాక్ష ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి తేజ్.. పంచెకట్టు లోనే కనిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా లుంగీలోనే వెళ్తున్నాడు. ఆ లుంగీ వెనుక కథ ఏంటి..? తేజ్ కు యాక్సిడెంట్ తరువాత ఏదైనా జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samantha: అప్పుడు చైతూ.. ఇప్పుడు సామ్.. ఫాన్స్ దేన్నీ వదలరుగా

ఇక తాజగా తేజ్.. ఆ లుంగీ వెనుక ఉన్న కథను రివీల్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ” మీరు విరూపాక్ష ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి లుంగీలోనే కనిపిస్తున్నారు.. ఏ బ్రాండ్.. ప్రమోషన్స్ చేస్తున్నారా..? ” అన్న ప్రశ్నకు తేజ్ మాట్లాడుతూ.. ” బ్రాండ్, ప్రమోషన్స్ ఏం లేవు.. విరూపాక్ష పాన్ ఇండియా సినిమా.. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను. మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా లుంగీ కట్టుకున్నాను. ఇక అందులోనూ వేసవి కాలం కాబట్టి.. గాలి బాగా ఆడుతుంది” అంటూ సరదాగా నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా తేజ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Show comments