Site icon NTV Telugu

Sai Dharam Tej: నాకు భయమేస్తోంది, తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది.. అర్ధం చేసుకోండి అంటూ ధరమ్ తేజ్ ట్వీట్!

Sai Dharam Tej Emotional Note

Sai Dharam Tej Emotional Note

Sai Dharam Tej Emotional note to fans after Bro Sucess tour: తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమాకి మంచి టాక్ రావడం కలెక్షన్స్ రావడంతో సాయి ధరమ్ తేజ్ మంచి సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి ఆయన ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లారు. ఇక ఆ టూర్ ముగిసిన వెంటనే ఆయన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరికీ నమస్కారం, BRO విజయయాత్ర లో భాగంగా మీరు నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థాంక్స్, అందరినీ కలుసుకోవడం, మీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం, చాలా బాగుంది. అయితే, నన్ను కలవడానికి వచ్చేవారు ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికొస్తున్నారు.

Bhola Shankar: భోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే

వీలైనంత మేరకు నేను అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ క్రమంలో చాలామంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటి హాని జరిగిన నాకు తీవ్ర మనస్థాపం కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల కన్నా బ్రోస్ గా భావిస్తాను. మీ భద్రత నా బాధ్యత. దయచేసి మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎట్టిపరిస్థితుల్లోను దీన్ని మరచిపోకండి. నాకు మీ ప్రేమను పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి. అర్థం చేసుకోగలరు అని భావిస్తున్నాను, ఇట్లు మీ సాయి తేజ్ అని ఆయన రాసుకొచ్చారు.

Exit mobile version