NTV Telugu Site icon

Sai Dharam Tej: నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు, తప్పుడు ప్రచారం చెయ్యకండి

Sai Dharam Tej

Sai Dharam Tej

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరుపాక్ష సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయిదు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల వరకూ రాబట్టి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తేజ్. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్‌ 10, 2021 రాత్రి సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో తీవ్ర గాయలయ్యి రోడ్డుపై స్పృహ తప్పి  పడిపోయిన తేజ్ ని అబ్దుల్‌ ఫర్హాన్‌ అనే వ్యక్తి గుర్తించి సకాలంలో హాస్పిటల్ చేర్చి సాయం అందించాడు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకు “అబ్దుల్‌కు మెగా ఫ్యామిలీ వరాలు… లక్ష రూపాయల నగదు, కారు, బైకు, బంగ్లా బహుమతిగా “ఇచ్చిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కరు కొట్టాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని విరూపాక్ష విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూల్లో తేజ్‌ క్లారిటీ ఇచ్చేశాడు. “పునర్జన్మను ఇచ్చిన అతనికి ఓ లక్ష ఇచ్చి చేతులు దులిపేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాయం చేశారేమో కానీ నాకు ఆ విషయం తెలియదు. దాని గురించి నేను ఎవరిని అడగలేదు. అబ్దుల్‌ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనే విషయం తెలుసు, తనకి ఏ సాయం కావలసినా నేరుగా ఫోన్‌ చేసి అడగొచ్చని హామీ ఇచ్చాను. అబ్దుల్ కి డైరెక్ట్‌ ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చాం’’ అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

లేటెస్ట్ గా ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ అండ్ టీంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నెగటివ్ ప్రచారం సాయి ధరమ్ తేజ్ వరకూ వెళ్లడంతో “నాపై, నా టీమ్‌పై దుష్ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇటీవల నేను ఇంటర్వ్లూలో చెప్పినట్లు నేను కానీ, నా టీమ్‌ కానీ అబ్దుల్‌కి ఎలాంటి రివార్డ్‌ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అతనికి ఏ సాయం కావాలన్ని కోరమని నాది, మా మేనేజర్‌ నంబర్స్‌ ఇచ్చాం. అతను ఎప్పుడు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు” అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మరి ఇక్కడితో అయినా ఈ యాక్సిడెంట్ విషయంలో తేజ్, అబ్దుల్ కి అందించిన విషయంలో వినిపించే రూమర్స్ ని ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

Show comments