NTV Telugu Site icon

Virupaksha: యాక్సిడెంట్ తర్వాత డూపు లేకుండా బైక్ స్టంట్ చేసిన సుప్రీమ్ హీరో

Virupaksha

Virupaksha

ఏ విషయం అయితే మనల్ని ఎక్కువగా భయపడుతుందో, ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆ భయపెట్టే విషయాన్ని చేసేయ్యాల్సిందే. కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి లోతు అంటే భయం… ఇలా ఎవరికి ఏ భయం ఉన్నా దాన్ని వెంటనే చేసేస్తే ఇక లైఫ్ లో ఎప్పుడూ మళ్లీ ఆ విషయం మనల్ని భయపెట్టదు. ఇలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న విషయం, బైక్ రైడింగ్. మంచి బైక్ రైడర్ అయిన తేజ్, ఇటివలే ఓవర్ స్పీడింగ్ కారణంగా ఇసకలో బైక్ స్కిడ్ అయ్యి ఒక యాక్సిడెంట్ ని ఫేస్ చేశాడు. లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్ లాంటి ప్రమాదం నుంచి తేజ్ కోలుకున్నాడు. ఇటివలే తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’ షూటింగ్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్, తన ఫియర్ ని ఓవర్కమ్ చేస్తూ ఒక స్టంట్ ని డూప్ లేకుండా చేశాడు.

థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న విరూపాక్ష సినిమాలో ఒక చెరువు గట్టుపైన ఉన్న మట్టి రోడ్ పై హీరో 100KMPH స్పీడ్ తో బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి బ్రేక్ కొట్టే సీన్ ఒకటి ఉంది. అసలు బైక్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హీరో, ఇలాంటి సమయంలో రిస్క్ ఎందుకు అని విరూపాక్ష చిత్ర యూనిట్ అంతా డూప్ తో చేసేద్దాం అనుకున్నారట. తేజ్ మాత్రం డూపు లేకుండా, తన భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ బైక్ స్టంట్ ని తనే చేశాడు. ఈ విషయాన్ని నేరేట్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. కరేజ్ ఓవర్ ఫియర్ అంటూ క్యాప్షన్ తో మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Courage Over Fear - Virupaksha | Sai Dharam Tej | Samyuktha Menon | Sukumar B | Karthik Dandu