NTV Telugu Site icon

Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పందన

Sagileti Katha

Sagileti Katha

Sagileti katha Movie Trailer Getting Huge Response: యూట్యూబర్ రవి మహా దాస్యం, రచ్చ సినిమాలో తమన్నా చిన్ననాటి పాత్రలో నటించిన విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న మూవీ ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. దివంగత నటుడు, ఎంపీ శివప్రసాద్ మేనల్లుడు నరసింహా ప్రసాద్ పంతగాని ముఖ్య పాత్ర పోషిస్తున్న, ఈ సినిమాను అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.

Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!

ఇక ఈ క్రమంలోనే తక్కువ వ్యవధిలో చిన్న సినిమా అయినా 1.5 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకొని 2 మిలియన్ వ్యూస్ దిశగా పరుగులు పెడుతుంది. ఈ సందర్భంగా చిత్ర సినిమా యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలోనే ఈ చిత్రం నుంచి ఒక మంచి లవ్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించబోతున్నామని వెల్లడించారు. రవి మహాదాస్యం, ‘విషిక లక్ష్మణ్’ హీరో హీరోయిన్ లగా ఈ చిత్రంతో పరిచయం కానుండడం గమనార్హం. ఇక ఈ సినిమా అంతా రుచికరమైన ‘చికెన్’ తినడానికి తహతహలాడే ‘రోషం రాజు'(నరసింహా ప్రసాద్ పంతగాని) పాత్ర చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చూశాక శాకాహారులు కూడా చికెన్ రుచి చూడాలని టెంప్ట్ అవుతారని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుందని చెబుతున్నారు.

Show comments