Site icon NTV Telugu

Producer Naga Vamsi : శర్వానంద్ కు బాకీ ఉన్నాడట !

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి అతిథులుగా హాజరయ్యారు. ఇక ‘భీమ్లా నాయక్’తో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ మాట్లాడుతూ టీజర్ చూడగానే సినిమా హిట్ అవుతుందని శర్వానంద్ తో చెప్పాను. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక శర్వానంద్ కు ఒక బాకీ ఉన్నాను. ఆ బాకీ ఎలాగైనా ఈ ఏడాది ప్లాన్ చేసి తీర్చాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అంటే త్వరలో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందన్న మాట !

Read Also : Sukumar : ఫేవరెట్ హీరో, హీరోయిన్ రివీల్… గ్యాంగ్ లీడర్ మాత్రం మిస్ అయ్యిందట !

https://www.youtube.com/watch?v=ydsjU7Ndcf0
Exit mobile version