Site icon NTV Telugu

Russia Ukraine War : భారతీయులపై జాతి వివక్ష… మండిపడుతున్న స్టార్ హీరోయిన్

Sonam-Kapoor

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !

సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు సంబంధించిన విషయంపై సోనాల్ కపూర్ స్పందిస్తూ ‘ఈ యుద్ధంలో భారతీయ ప్రజలు రెండు వైపుల నుండి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారు. భారత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖండించదగినది. దీన్ని తక్షణమే ముగించాలి” అంటూ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్లు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్రికన్ విద్యార్థులు కూడా జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారు.ని అడిగారు. ఒకవైపు యుద్ధ పరిస్థితుల వల్ల బిక్కుబిక్కుమంటూ ఉంటే… అదే సమయంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని, బయటపడడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఇలా జాతి వివక్ష ఎదురవ్వడం బాధాకరం.

Exit mobile version