యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీని వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. మరోవైపు హిందీలోనూ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అయితే తాజా వార్తల ప్రకారం సినిమా ట్రైలర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట.
Read Also : ఏపీ సీఎంను కలిసిన సమంత స్నేహితురాలు… ఎందుకు ?
నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఆరోజు కుదరకపోతే డిసెంబర్ 21న విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి టీజర్ సంగతి ఏంటనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఇక “రాధే శ్యామ్” థియేట్రికల్ విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను మరింత ముమ్మరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఈ సినిమా నుంచి “సోచ్ లియే” అనే హిందీ సాంగ్ విడుదల కాబోతోంది.
