Site icon NTV Telugu

Anushka: తెలంగాణ కోడలు కాబోతున్న అనుష్క.. వరుడు అతడే..?

Anushka

Anushka

Anushka: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే ఫస్ట్ చెప్పుకొనే పేర్లు ప్రభాస్- అనుష్క. ఈ జంట మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇక ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ మా మధ్య స్నేహ బంధం తప్ప ఇంకేదీ లేదని ఈ జంట చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృషంరాజు మృతి చెందినప్పుడు కూడా ప్రభాస్ కు తోడుగా అనుష్క హాస్పిటల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కృష్ణంరాజు కూడా గతంలో అనుష్క ఎంతో మంచి అమ్మాయి అని, ప్రభాస్ కు మంచి స్నేహితురాలిని చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటినుంచో అనుష్క పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతూనే వస్తున్నాయి. కృష్ణంరాజు మృతి తర్వాత ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే ప్రభాస్ కు కొద్దిగా ఊరట లభిస్తుందని, మంచి స్నేహితురాలు, మంచి భార్య అవుతుందని ప్రభాస్ అభిమానులు సలహా ఇస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క పెళ్లి వేరొకరితో ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణకు చెందిన ఒక గోల్డ్ స్మిత్ తో స్వీటీ పెళ్లిని ఫిక్స్ చేసారట ఆమె కుటుంబ సభ్యులు. ఈ పెళ్ళికి స్వీటీ సైతం ఓకే అనడంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డారట.. ప్రస్తుతం అనుష్క వయస్సు 40.. ఏజ్ అయిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో పాటు స్వీటీ కూడా పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలని చూస్తున్నదట. ఇక తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేశాక పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందట ఈ అరుంధతి. ప్రస్తుతం అనుష్క.. నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఇక అనుష్క పెళ్లి వార్త నిజమైతే.. అమ్మడు తెలంగాణ కోడలు అయ్యిపోయినట్లే..

Exit mobile version