NTV Telugu Site icon

KGF 2 : ఓటిటిలో ఎప్పుడంటే ?

Kgf 2

Kgf 2

‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. రాఖీ భాయ్ అభిమానులు థియేటర్లలో ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు.

Read Also : Poonam Pandey : సొంత ఫ్యామిలీనే గెంటేసింది… హీరోయిన్ ఎమోషనల్

రాఖీ భాయ్ వయోలెన్స్ కు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయడానికి డేట్ ఖరారైందినేది ఆ వార్త. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ఓటిటిలో స్ట్రీమ్ అవ్వనుందని అంటున్నారు. మే 13న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా అప్పుడే ఓటిటిలో విడుదల చేయబోరని యష్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేకర్స్ నుంచి ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే.

Show comments